Abn logo
Sep 17 2021 @ 01:09AM

వెల్లివిరిసిన మానవత్వం

రాప్తాడు, సెప్టెంబరు 16: తమ కుమారుడు మరణించి పుట్టెడు దుఖ:ంలో ఉన్నప్పటికీ మరణించిన కు మారుడి కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటారు. ఆ దంపతులు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. మండలంలోని బండమీదపల్లికి చెందిన బాలగొండ సంజీవులు కుమారుడు శివప్రసాద్‌ కుమార్‌ కష్టపడి చదివి డాక్టరు అయ్యాడు. భార్య ప్రియాంకతో కలిసి బెంగళూరులో నివా సముంటూ ఓ ప్రైవేటు చిన్న పిల్లల ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్నాడు. శివప్రసాద్‌కుమార్‌, ప్రియాంకల కుమారుడు జయదేవ్‌ (4) బుధవారం బెంగుళూరు లో ఇంటి వద్ద ఎవ్వరూ లేని సమయంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మరణించాడు.  అంత దుఖ:ంలో ఉన్నప్పటికీ కుమారుడి కళ్లను ఇతరులకు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు ప్రభుత్వాసుపత్రి ఐ బ్యాంకుకు సమాచారం అందించా రు. వెంటనే ఐ బ్యాంకు సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి జ యదేవ్‌ కళ్లను తీసుకుని తల్లితండ్రులను అభినందించా రు. అనంతరం జయదేవ్‌ మృతదేహాన్ని స్వగ్రామం బం డమీదపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.  శివప్రసాద్‌కుమార్‌, ప్రియాంక దాతృత్వాన్ని గ్రామస్థులు, స్నేహితులు కొనియాడారు.