Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ వసూళ్లు వేగవంతం చేయాలి

మండల ప్రత్యేకాధికారి నాగమల్లేశ్వరరావు

సబ్బవరం, నవంబరు 27 : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఓటీఎస్‌(వన్‌టైం సెటిల్‌మెంట్‌) వసూళ్లను  వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాఽధికారి నాగమల్లేశ్వరరావు సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల వారీగా అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి పథకం ఉపయోగాలను వివరించాలని సూచించారు. అనంతరం గ్రామాల వారీగా కార్యదర్శులను పిలిచి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, ఎంపీడీవో రమేశ్‌నాయుడు, తహసీల్దార్‌ రమాదేవి, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌టీ రామకాసు, ఏవో షేక్‌ బాబూరావు, ఈవోపీఆర్‌డీ మహేశ్‌, హౌసింగ్‌ ఏఈ శేఖర్‌నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హిమబిందు, ఏవో పోతల సత్యనారాయణ, కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement