Abn logo
May 23 2020 @ 03:47AM

సెరెనాను దాటిన ఒసాక

న్యూయార్క్‌: జపాన్‌ టెన్నిస్‌ సంచలనం నవోమి ఒసాక ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె సెరెనా విలియమ్స్‌ను అధిగమించింది.. గత 12 నెలల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ శుక్రవారం ప్రకటించిన ఈ జాబితాలో రూ. 284.20 కోట్లతో ఒసాక టాప్‌లో నిలిచింది. ఏడాదిలో ఒసాక ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్ల రూపంలో సెరెనా కన్నా రూ. 10.64 కోట్లు అధికంగా సంపాదించింది. 22 ఏళ్ల ఒసాక ఇప్పటిదాకా రెండు గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచింది.

Advertisement
Advertisement
Advertisement