Abn logo
Sep 30 2020 @ 03:27AM

నల్ల ధనం వచ్చే మార్గం కట్‌

  • వాళ్లకు దళారులే బాగుపడాలి...రైతులు కాదు : మోదీ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ‘వీరంతా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు..ఎందుకంటే వారికి నల్లధనం సంపాదించే ఓ మార్గం మూసుకుపోయింది. విపక్షాలకు దళారుల వ్యవస్థే కావాలి. దళారులే బాగుపడాలి.. రైతులు కాదు’’ అని విమర్శించారు. జలజీవన్‌ మిషన్‌ లోగోను, నమామి గంగే పథకం కింద ఉత్తరాఖండ్‌లో ఆరు ప్రాజెక్టులను మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ‘‘రైతు తన ఉపకరణాలను పూజిస్తాడు. అలాంటి వాటిని తగలబెడుతున్నారు. ఇది రైతును అవమానించడమే’’ అని ఇండియాగేట్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు ట్రాక్టర్‌ను దహనం చేయడాన్ని దుయ్యబట్టారు. రైతులు పంటను విక్రయించుకునేందుకు తాము ఇచ్చిన స్వేచ్ఛను కాంగ్రెస్‌ అడ్డుకుంటోందన్నారు. రాఫెల్‌ ఒప్పందం నుంచి రైతు సంక్షేమం దాకా అన్నింటికీ ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. 


Advertisement
Advertisement
Advertisement