Abn logo
Oct 13 2021 @ 00:08AM

ఊరూరా బతుకమ్మ సంబురాలు

బాన్సువాడలో బతుకమ్మ ఆడుతున్న స్పీకర్‌

పాల్గొన్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ, అక్టోబరు 12: జిల్లావ్యాప్తంగా బతు కమ్మ సంబురాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగ ళవారం బాన్సువాడ పట్టణంలో కొనసాగిన బతుక మ్మ సంబరాల్లో మంగళవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి కోలాటాలు ఆడుతూ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 

సదాశివనగర్‌: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలను వీక్షించడానికి జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌సలాం, జిల్లా ప్రిన్సిపాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనాథ్‌లు పా ల్గొన్నారు. ఈ సందర్బంగా నోడల్‌ అధికారి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులు వివిధ రకాలపూలతో బతుకమ్మను అలంకరించిగౌరమ్మను పూజించినందుకు విద్యార్థులకు  శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కళాశాల ప్రిన్సిపాల్‌ అజ్మ ల్‌ఖాన్‌, అఽధ్యాపకులు లక్ష్మీ, సుస్మిత, ప్రతాప్‌కిరణ్‌, ప్రకాష్‌, మల్లయ్య, చంద్రశేఖర్‌, అనంత సుధాకర్‌, ఇస్రత్‌, చందు, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని లు బతుకమ్మలను రంగురంగుల పూవులతో అం దంగా పేర్చి కళాశాల మైదానంలో బతుకమ్మ పాట లు ఆడి, పాడి సంతోషంగా గడిపారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌రెడ్డి, మహిళా లెక్చరర్లు శ్రీలత, అంజమ్మలతో పాటు లెక్చరర్లు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

నాగిరెడ్డిపేట: మండలకేంద్రంలోని సిద్ధార్థ జూ నియర్‌ కళాశాలలో మంగళవారం విద్యార్థినులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. ఇందులో ప్రిన్సిపాల్‌ మన్మోహన్‌ రెడ్డి, అధ్యాపకులు శ్యామల, సంతోష్‌, సుధాకర్‌, మ హేష్‌, సాయిలు, కిషన్‌ రాథోడ్‌, తదితరులున్నారు.

పిట్లం: మండల పరిషత్‌ కార్యాలయంలో బతు కమ్మ పండగ సందర్భంగా ఎంపీపీ కవిత బతుకమ్మ సంబరాల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బతుకమ్మలు తీరొక్క పూలతో తయారు చేశారు. మహిళలు అందరూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. ఎంపీపీ మాట్లాడుతూ మండల పరిషత్‌ కార్యాలయంలో ఆడపడుచుల పండగ కావడంతో అందరం కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ విజయలక్ష్మి, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు సుజాత, స్రవంతి, అంగన్‌వాడీ టీచర్లు, ఐకేపీ, మహిళా పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.