Abn logo
May 19 2020 @ 04:59AM

నకిలీ విత్తనాలకు చెక్‌ పెట్టేందుకే తనిఖీలు

భూత్పూర్‌, మే 18: రైతులకు సరఫరా చేసే విత్తనాల్లో నకిలీ, నాణ్యత లేనివి ఉండొద్దని, ముందు జాగ్రత్తగా ప్రాసెసింగ్‌ యునిట్లలో, విత్తన విక్రయ దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు దేవరకద్ర ఏడీఏ యశ్వంత్‌రావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని విత్తనాల ప్రాసెసింగ్‌ యునిట్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వారం నుంచి మండలంలోని వివిధ ప్రాసెసింగ్‌ యునిట్లలో టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు చేసిందన్నారు. విత్తనాల్లో తేడా కనిపిస్తే వాటిని అమ్మకుండా సీల్‌ వేస్తున్నామన్నారు. తనిఖీల్లో ఏఓ రాజేందర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement