Abn logo
Oct 13 2020 @ 01:40AM

భద్రత కోసమే ఆన్‌లైన్‌ నమోదు

Kaakateeya

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు 


మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తుల భద్రత కోసమే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించిందని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ట్రిడెంట్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంటులో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను కలెక్టర్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులు స్థిరాస్తుల వివరాలను  టీఎ్‌సఎన్‌పీబీలో నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.


తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అమరం సరస్వతీ మోహన్‌రెడ్డి, ఆర్‌ఐ శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు. కాగా, ఘట్‌కేసర్‌ మండలంలోని కొర్రెములలో సర్పంచ్‌ వెంకటే్‌షగౌడ్‌ ఇంటింటి సర్వేను పరిశీలించారు. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కందుల రాజు, కార్యదర్శి కవిత, వార్డుసభ్యుడు దుర్గరాజుగౌడ్‌, నాయకులు రవి, పంచాయతీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement