Abn logo
Apr 21 2021 @ 08:58AM

దేశవ్యాప్త లాక్‌డౌన్ పడుతుందేమోనని 6 లక్షల వాహనాలు సిద్ధం చేశాం: గ్రోఫర్స్ సీఈఓ

న్యూఢిల్లీ: మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలియగానే పలు దుకాణదారులు ఇంటర్నెట్‌పై లాగ్‌ఆన్ అయ్యారు... ప్రధాని దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటిస్తారేమోనని భావించి, కిరాణా సామాను ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం ఎదురు చూశారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఆన్‌లైన్ గ్రాసరీస్ ప్లాట్‌ఫారం గ్రాఫర్స్ సీఈఓ, సహవ్యవస్థాపకులు అల్బిందర్ ఠీండస్ ఒక ట్వీట్ చేశారు. ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువులు తరలించేందుకు 6 లక్షల వాహనాలు సిద్ధం చేశామని, చెక్ అవుట్ కోసం వెయిట్ చేశామని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఠీండస్ ఈ ట్వీట్ ను రాత్రి 9 గంటల సమయంలో చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్ గురించి ఎటువంటి ప్రకటనా చేయలేదు.


Advertisement
Advertisement