Abn logo

ఆనియన్ రింగ్స్

కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయలు - 2, మైదా - ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్‌ - అర కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా - అర టీ స్పూను, ఉప్పు - రుచికి, మిరియాల పొడి - అర టీ స్పూను, బ్రెడ్‌ పౌడర్‌ - ఒక కప్పు, నూనె - వేగించడానికి.


తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిపాయల్ని అడ్డుగా తరిగి రింగులుగా విడదీయాలి. ఒక పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, బియ్యప్పిండి, బేకింగ్‌ సోడా, ఉప్పు, మిరియాల పొడి కలిపి తగినంత నీరు పోసి జారుగా కలపాలి. దీన్లో ఉల్లి రింగులు ముంచి బ్రెడ్‌ పొడిలో జాగ్రత్తగా దొర్లించి పక్కనుంచాలి. అన్నీ అయ్యాక నూనె తక్కువ వేడిపై ఉండగానే వేగించి తీయాలి. లేదంటే మాడిపోతాయి. వర్షాకాలం సాయంత్రం టిఫిన్‌గా టమాటో కెచప్‌తో తింటే బాగుంటాయివి.

గుజరాతీ హండ్వా లుక్మీ సమోసా ఆలూ బరడాదోసకాయ బరడాబరడా పాల్యా (సెనగపప్పు బరడా)యెరియప్పరోస్టెడ్‌ ఎగ్‌ప్లాంట్‌ బెల్‌ పెప్పర్‌ సలాడ్‌లివర్ ఫ్రాంకీ (వీడియో)పొటాటో ఫింగర్స్అలసందా పెరుగు వడ(వీడియో)
Advertisement
Advertisement