Abn logo
Nov 1 2020 @ 01:25AM

ఉల్లి దిగింది!

Kaakateeya

  • హోల్‌సేల్‌లో స్వల్ప తగ్గుదల 
  • మహారాష్ట్ర పాయలొస్తే ఇంకా తగ్గొచ్చు
  • మరో 15 రోజులు ఇవే ధరలు ఉంటాయని చెబుతున్న వ్యాపారులు

రాజమహేంద్రవరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధరలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. హోల్‌సేల్‌ లో కేజీ రూ.70 నుంచి 80 వరకూ రాగా, చిల్లర వ్యాపారులు కేజీ రూ.120 వరకూ అమ్మారు. ఇప్పుడు ఉల్లి ధరలు కొద్దిగా తగ్గాయి. హోల్‌సేల్‌లో మంచిరకం పాయలు కేజీ రూ.50 నుంచి రూ.65 వరకూ ఉన్నాయి. డామేజీ రకాలు రూ.35 నుంచి 40 వరకూ ఉన్నాయి. చిల్లర మార్కెట్‌లో ఇష్టానుసారం విక్రయిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలో కూడా భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. అయితే మార్కెట్‌లో ఉల్లిపాయల కొరత లేదు. ఓ మాదిరి నుంచి నాసిరకం దాకా లభిస్తున్నాయి. కానీ సరఫరా తగ్గితే డిమాండ్‌ పెరిగి ధరలు పెరుగుతాయనే మార్కెట్‌ సాధారణ సూత్రానికి విరుద్ధంగా ఉల్లిపాయల మార్కెట్‌ నడుస్తోంది. అధికారులు కూడా ఎవరూ ఆరా తీయరు. మార్కెట్‌లో ఉల్లిపాయల కొరత లేదు. కానీ మంచిరకం దొరకడంలేదు. రైతు బజార్లలో మరీ నాసిరకం అమ్ముతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ నుంచే సరఫరా అవుతోంది. దీపావళికి మహారాష్ట్ర నుంచి ఉల్లి బాగా వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement