Abn logo
Sep 24 2020 @ 05:20AM

దేవాలయాల్లో దాడులపై నోరు మెదపని సీఎం

Kaakateeya

 జిల్లా తెలుగు రైతు సంఘం 

అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి 


కనిగిరి, సెప్టెంబరు 23 : రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నోరు మెదపరెందుకని జిల్లా తెలుగు రైతు సం ఘం అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు నిరసిస్తూ కనిగిరిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసనగా పొర్లు దం డాలు చేసి మోకాళ్లపై పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా రాచమల్ల మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగినా, బీసీలపై తప్పుడు కేసులు బనాయించినా, గిరిజనులు, ముస్లింపై దౌర్జన్యాలు జరిగినా వాటిపై సీఎం జగన్‌నోరు మెదపకపోవడమే కాకుండా ఖండించక పోవడం బాధాకరమన్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హిందూమతం స్వీకరించినట్లు ప్రజలను న మ్మించి గెలిచాక బైబుల్‌ పక్కన పెట్టుకొని ప్రమాణ స్వీకారాలు చే యడం వెనుక ఓటు బ్యాంక్‌ రాజకీయాలను సీఎం జగన్‌ చేస్తున్నారని ఆరోపించారు.


ఈ కార్యక్రమంలో నా యకులు బుజ్జా, తమ్మినేని వెంకటరెడ్డి, గండికోట రమేష్‌, బ్రహ్మం గౌ డ్‌, వెంకట్‌ చౌదరి, మధు, కాసుల శ్రీరాం, ఫిరోజ్‌, శ్రీనివాసరావు, జిలానీ, శాంతి శ్రీను, కోటేశ్వరరావు, కోటా సురేష్‌, బాలు, కోటి, అహ్మద్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement