యాచారం : యాచారం మండలం గున్గల్ సమీపంలో సోమవారం రాత్రి బైక్ బోల్త్తాపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. మంచాల మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య (46) సోమవారం రాత్రి యాచారం పంచాయతీ పరిధి గాండ్లగూడలో తమ బంధువుల ఇంటికొచ్చి అదే రాత్రి తన స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా గున్గల్ రిజర్వాయర్ సమీపంలో బైక్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే చికిత్స కోసం నగరానికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య చెప్పారు.