Abn logo
Sep 27 2020 @ 08:54AM

నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

Kaakateeya

నెల్లూరు : జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం ఆయన్ను అతి కిరాతకంగా చంపేశారు. ఈ ఘటనతో చేజర్ల ఇంట్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


అయితే సుబ్రమణ్యంను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? పాత కక్షల నేపథ్యంలో ఇలా చేశారా..? లేకుంటే ఇంకేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement
Advertisement