Abn logo
Mar 27 2020 @ 13:24PM

‘ఆర్ఆర్ఆర్‌’లో మ‌రో సూప‌ర్‌స్టార్‌...ఎవ‌రో తెలుసా?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్‌)’. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్, స‌ముద్ర ఖ‌ని ఇలా భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. లేటెస్ట్‌గా ఈ సినిమాలో మ‌రో సూప‌ర్‌స్టార్ న‌టిస్తాడంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ సూప‌ర్‌స్టార్ ఎవ‌రో తెలుసా?  మోహ‌న్‌లాల్‌. ఈ మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌ను ఈ భారీ చిత్రంలో న‌టింప చేయాల‌నుకుని రాజమౌళికి ఆయ‌న‌కు పాత్ర గురించి చెప్పాడ‌ట‌. ఆయ‌న కూడా న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నాడంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌లపై జ‌క్క‌న్న అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement
Advertisement