Abn logo
Oct 13 2021 @ 00:07AM

వారం రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ : కలెక్టర్‌

ఎల్లారెడ్డిలో వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

ఎల్లారెడ్డి, అక్టోబరు 12: వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డిలో ఇంటింటికీ తిరుగుతూ వైద్యసిబ్బంది వేస్తున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. దీనిలో భాగంగా ఓ కుటుంబంలో ని ఐదుగురికి వ్యాక్సిన్‌ వేయించారు. 95ఏళ్ల వృద్ధురాలు ఆఫీజాబేగంకు వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారు. కరోనా  రాకుండా ప్రతీఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం ఎల్లారెడ్డి మండలం మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సం దర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వేయించుకుని ప్రజలకు అవ గాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డీవో రాజాగౌడ్‌, డిప్యుటీ డీఎంహెచ్‌వో శోభారాణి, ఎంపీపీ మాధవి, మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌, సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, ఎంపీడీవో మల్లిఖార్జున్‌రెడ్డి, తదితరులున్నారు.

బాన్సువాడ: ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని  కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం పట్ట ణంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దన్నారు. ఆయా కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఇందులో ఆర్డీవో రాజాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, కమిషనర్‌ రమేష్‌, తదితరులున్నారు.