Abn logo
Oct 22 2021 @ 00:40AM

కొవిడ్‌తో ఒకరి మృతి

తాజాగా 113 మందికి కరోనా నిర్ధారణ 


తిరుపతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల వ్యవధిలో 113 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే వ్యవధిలో కొవిడ్‌తో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 246156కు, కొవిడ్‌ మరణాలు 1939కి చేరాయి. గురువారం ఉదయానికి 992 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. తాజా పాజిటివ్‌ కేసులు.. తిరుపతి నగరంలో 19, చిత్తూరు, మదనపల్లె మండలాల్లో 16 చొప్పున, తిరుపతి రూరల్‌లో 8, గుడుపల్లెలో 6, పీలేరులో 4, పుత్తూరు, వాల్మీకిపురం, వెదురుకుప్పం, నిమ్మనపల్లె మండలాల్లో 3 వంతున, కేవీపల్లె, వడమాలపేట, ఐరాల, తొట్టంబేడు, తవణంపల్లె, కుప్పం, యాదమరి మండలాల్లో 2 చొప్పున, పుంగనూరు, పలమనేరు, చంద్రగిరి, కలికిరి, పులిచెర్ల, పెనుమూరు, చిన్నగొట్టిగల్లు, పెద్దపంజాణి, ఎర్రావారిపాలెం, పాకాల, కలకడ, సత్యవేడు, బైరెడ్డిపల్లె, జీడీనెల్లూరు, తంబళ్ళపల్లె, పెద్దమండ్యం, గుడిపాల, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.