Abn logo
Sep 27 2020 @ 03:03AM

పట్టభద్రుల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి

1న నేనూ ఓటు నమోదు చేయించుకుంటా

టీఆర్‌ఎస్‌ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఓటరు నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.50లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులందరూ తొలిరోజే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. తానూ అదే రోజున ఓటరుగా నమోదు చేయించుకుంటానని వెల్లడించారు.


కాగా, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమన్వయం కోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను కేటీఆర్‌ నియమించారు. వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల బాధ్యతలను బోయినపల్లి వినోద్‌కుమార్‌, కడియం శ్రీహరికి అప్పగించారు. జనగామ, పాలకుర్తిలకు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పరకాల, వర్ధన్నపేటకు బోడకుంటి వెంకటేశ్వర్లు, భూపాలపల్లికి పసునూరి దయాకర్‌, కె.వాసుదేవరెడ్డి, నర్సంపేట, ములుగుకు మాలోతు కవిత, నాగుర్ల వెంకన్న, మహబూబాబాద్‌, డోర్నకల్‌కు బస్వరాజు సారయ్య, మార్నేని రవీందర్‌రావు, మహబూబాబాద్‌కు శ్రీనివాస్‌, ేస్టషన్‌ఘన్‌పూర్‌కు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇన్‌చార్జిలుగా నియమించారు.

Advertisement
Advertisement
Advertisement