Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యంపై.. సిండికేట్‌!


కొత్తగా లైసెన్సులు పొందిన వారితో ప్రాంతాల వారీగా ఒప్పందాలు
గుడ్‌విల్‌తో గాలం
జిల్లాలోని గ్రామాల్లో బెల్ట్‌షాప్‌లకు భారీ డిమాండ్‌
ఒకటో తేదీ నుంచి కొత్తషాప్‌ల ద్వారా మద్యం అమ్మకాలు

నిజామాబాద్‌, నవంబరు 25:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) జిల్లాలో కొత్త మద్యం దుకాణాలపై సిండికేట్‌ దృష్టిపెట్టింది. తమకు అనుకూలంగా రానిచోట వచ్చిన వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. భారీ మొత్తంలో గుడ్‌విల్‌ ఇస్తూ దుకాణాలను నడిపేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లావ్యాప్తంగా లైసెన్సుపొందినవారు బెల్ట్‌ దుకాణాలపై నజర్‌పెట్టారు. గ్రామాల్లో భారీగా ఈ బెల్ట్‌ దుకాణాల ద్వారా మద్యం విక్రయించేందుకు వీడీసీలు, గ్రామ పెద్దలతో ఒప్పందాలను చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా మద్యం అమ్మకాలు పెరగడం, లాభాలు ఎక్కువగా ఉండడంతో భారీగా నజరానాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
లైసెన్సుల కేటాయింపు..
జిల్లాలో 102 మద్యం దుకాణాలకు టెండర్‌లను పిలిచారు. వీటిలో ఈ నెల 20న 99 దుకాణాలకు టెండర్‌లను ఖరారు చేశారు. డ్రా ద్వారా దుకాణాలను కేటాయించారు. దుకాణాలు పొందినవారి నుంచి దారావత్‌ను స్వీకరించి ప్రొవిజనల్‌ లైసెన్సులను మంజూరు చేస్తున్నారు. ఈ లైసెన్సు ద్వారా మద్యంకొనుగోలు చేయడంతో పాటు అమ్మకాలకు అవకాశం ఇస్తున్నారు. డిసెంబరు 1 నుంచి దుకాణాలు తెరిచేందుకు ఈ లైసెన్సు ద్వారా అనుమతిచ్చారు. నిర్ణీత దరఖాస్తులు రాని మూడు దుకాణాలకు మరో దఫా టెండర్‌లు పిలిచేందుకు ఎక్సైజ్‌ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు.
ఎంత అమ్మితే అంత...
జిల్లాలో ఈ దఫా ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో వెసులుబాటును కల్పించింది. గతం కంటే నాలుగింతలు అమ్మ కాలను పెంచి అవకాశం ఇచ్చింది. టెండర్‌ పొందిన ప్రతి ఒక్కరూ మరింతలాభాలను పొందేందుకు అవకాశం ఇ చ్చింది. మద్యంఎంత ఎక్కువగా అమ్మకాలు చేస్తే అంత లాభాలు వచ్చే అవకాశం ఉండడంతో దుకాణాలపైన ఎక్కువ మంది నజర్‌ పెట్టారు. ఈ దఫా భారీగా టెండర్‌ వేశారు. టెండర్‌ వేసినవారి దుకాణాలు రాకపోయిన ఇతర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యందుకాణాలు పొందిన వారితో ఒప్పందాలను చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నవారు కొత్తగా లైసెన్సు పొందినవారు, బాగా అమ్మే దుకాణాలు పొందినవారి నుంచి గుడ్‌విల్‌ ఇచ్చి ఒప్పందాలను చేసుకుంటున్నారు. ఒక్కొషాప్‌కు రూ.10 నుంచి రూ. 30 లక్షల వరకు ఈ గుడ్‌విల్‌ను ఇస్తున్నారు. మద్యం వ్యాపారంలో సిండికేట్‌గా ఉన్న కొంతమంది ప్రాంతాల వారీగా ఈ ఒప్పందాలను చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండ ఉండడం, దుకాణాలు పొందినవారు, వ్యాపారంలో ఉన్నవారికి రాజకీయ పలుకుబడి ఉండడంతో కొత్తగా లైసెన్సులు పొందినవారు కూడా ఈ ఒప్పందాలను చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రధాన అమ్మకాలు జరిగే ప్రాంతాల్లో ఈ ఒప్పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ అధికారులకు తెలిసిన లైసెన్సులు పొందినవారి పేరుమీదను దుకాణాలు నడుస్తుండడంతో పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో భారీ రాబడి ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో పోటీపడుతున్నారు. పది, పదిహేనుమంది సిండికేట్‌గా ఏర్పడి ఈ ఒప్పందాలు కొనసాగిస్తున్నారు.
పెరుగుతున్న అమ్మకాలు..
జిల్లాలో మద్యంఅమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రతీ సంవత్సరం పది నుంచి 15శాతం వరకు అమ్మకాలు పెరుగుతున్నాయి. మద్యం ధరలు పెరిగిన అమ్మకాలు మాత్రం తగ్గడంలేదు. ప్రభుత్వం అమ్మకాలపై వెసులుబాటు కల్పిం చడంతో దుకాణాలు పొందినవారికి భారీ ఎత్తునలాభాలు వస్తున్నారు. ప్రతీ సంవత్సరం రూ.400 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దుకాణాలు టెండర్‌ పొందినవారికి రెండేళ్లు లైసెన్సులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఈ అమ్మకాలు చేస్తున్నారు. దుకాణంతో పాటు షాప్‌ పరిధిలోని ఆయా గ్రామాల్లో బెల్ట్‌షాప్‌ల ద్వారా అమ్మకాలను పెంచడంతో భారీగా లాభాలు వస్తున్నాయి. ప్రతీ మద్యం దుకాణం పరిధిలో 10 నుంచి 20 వరకు బెల్ట్‌షాప్‌లు ఉన్నాయి. ప్రతీ గ్రామంలో 1 లేదా 2 షాప్‌లను వేలం ద్వారా కొన్ని ఈ అమ్మకాలను చేస్తున్నారు.
    
వచ్చే నెల 1 నుంచి అమ్మకాలు..
జిల్లాలో డిసెంబరు 1 నుంచి టెండర్‌లు పొందినవారు మద్యంఅమ్మకాలను చేపట్టనున్నారు. వారికి ప్రొవిజనల్‌ లైసెన్సులు ఇవ్వడం వల్ల మద్యండిపో నుంచి ముందుగా నే స్టాక్‌ను తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అమ్మకాలు చేసినవారికి ఈ నెల 30 వరకే అవ కాశం ఉండడంతో ముందస్తుగా మద్యాన్ని కొనుగో లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం లైసెన్సులు పొందినవారు కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది పాత దుకాణాల్లోనే నడిపించేందుకు ఒప్పందా లు చేసుకుంటున్నారు. డిసెంబరు 1 నుంచిలైసెన్సులు పొందినవారు అమ్మకాలు చేయడంతో గ్రామాల్లో అమ్మకాలపైన దృష్టిపెట్టారు. బెల్ట్‌షాప్‌లు నడిపించేవారితో మాట్లాడుతున్నారు. గతంలోలాగానే తమతో ఒప్పందాలు చేసుకు ని అమ్మకాలు చేసేవిధంగా ఏర్పాట్లను చేసుకుంటున్నారు. బెల్ట్‌షాప్‌ల నిర్వాహకులు కూడా మరో రెండేళ్ల కోసం గ్రామాల్లోని వీడీసీలు, గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నారు. తమకు అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామాల్లో మద్యంఅమ్మకాల కోసం రెండు నుంచి ప ది లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు బెల్ట్‌షాప్‌ల నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రా మ పెద్దలు అనుమతులిస్తే రెండేళ్ల పాటు మద్యం అమ్మకాలకు ఢోకా ఉండదని, ఏ సమస్యలు వచ్చినా వారు పరిష్కరిస్తారని ముందే ఈ ఒప్పందాలను చేసుకుంటున్నారు. మ ద్యం అమ్మకాల్లో లాభాలు పెరగడం వల్ల ఎక్కువ మంది ఈ వ్యాపారంపై దృష్టిపెట్టారు. ఒప్పందాలు కానిచోట ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి పెంచుతూ చేసుకుంటున్నారు. జిల్లాలో మద్యం అమ్మకాలపై దృష్టిపెట్టిన అధికారులు మాత్రం బెల్ట్‌షాప్‌లపై అంతగా దృష్టిపెట్టడంలేదు. తమ టార్గెట్‌కు అనుగుణంగా మద్యం అమ్మకాలు కొత్తషాప్‌ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.
ప్రొవిజనల్‌ లైసెన్సులు మంజూరు
- డాక్టర్‌ నవీన్‌చంద్ర, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

జిల్లాలో కొత్తగా మద్యందుకాణాలు పొందినవారందరికీ ప్రొవిజనల్‌ లైసెన్సులు మంజూరు చేశాం. టెండర్‌లు పొందినవారందరు డిసెంబరు 1 నుంచి తమ షాప్‌ల పరిధిలో మద్యం అమ్మకాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మద్యం అక్రమ అమ్మకాలపైన దృష్టిపెట్టి చర్యలు చేపడుతున్నాం. సిండికేట్‌ వ్యవహారాలు తమ దృష్టికి రాలేదు. లైసెన్సు పొందినవారే అమ్మకాలు చేస్తారు.


Advertisement
Advertisement