Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాకుళం జిల్లాలో ఒమైక్రాన్ కలకలం?

శ్రీకాకుళం: ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వేరియంట్ ఒమైక్రాన్ రాష్ట్రంలో ప్రవేశించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో ఒమైక్రాన్ కలకలం రేపింది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడలో లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో లక్షణాలు బయపడ్డాయి. అయితే జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్ధారించలేదు. గత నెల 23న లండన్ నుంచి గ్రామానికి ఆ వ్యక్తి వచ్చాడు. బాధితుడిని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు. అయితే అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గ్రామంలో ముందు జాగ్రత చర్యగా శానిటేషన్ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించి తగిన జాగ్రతలు పాటించాలన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. 

 ఇది ఇలా ఉండగా  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 20,74,036 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,455 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,008 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,57,573 మంది రికవరీ చెందారు. 


Advertisement
Advertisement