Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. కెనడాకు చేరుకున్న వెంటనే విదేశీ ప్రయాణికులు ఈ పని కచ్చితంగా చేయాల్సిందే.. అదేంటంటే..

ఎన్నారై డెస్క్: కరోనా వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రపంచ దేశాలు అప్రమత్తవతున్నాయి. కరోనా ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులు పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. కెనడాకు చేరుకున్న వెంటనే మాలిక్యూలార్ టెస్ట్ చేయించుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. అంతేకాకుండా టెస్టుకు సంబంధించిన ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాలని వెల్లడించింది. అంతేకాకుండా.. దక్షిణాఫ్రికాకు చెందిన ఏడు దేశాలపై ఇప్పటికే బ్యాన్ విధించిన కెనడా.. ఆ జాబితాలో మరికొన్ని దేశాలను చేర్చింది. 


ఈజిప్ట్, నైజిరియా, మాలవి దేశాలపై కూడా నిషేధం విధించింది. గడిచిన 14 రోజుల్లో నిషేధిత దేశాల జాబితాలో పర్యటించినట్టు ప్రయాణికుల  ట్రావెల్ హిస్టరీలో ఉంటే.. సదరు ప్రయాణికులు కెనడాకు బయల్దేరడానికి 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుందని పేర్కొంది. నిషేధిత దేశాల జాబితాలో ఉన్న కెనడా పౌరులు, నివాసితులు కెనడాకు రావొచ్చని తెలిపింది. అయితే సదరు వ్యక్తులు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. కెనడాలో ఇప్పటి వరకు 7 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు బూస్టర్ డోసులు ఇచ్చే అంశంపై కెనడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement