Abn logo
Jul 7 2020 @ 03:25AM

వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ జరగవు!

77 శాతం మంది జపనీయుల అభిప్రాయం 

ఓ సర్వేలో వెల్లడి

టోక్యో: కరోనా విలయ తాండవం చేస్తుండడంతో ఈ నెలలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్‌ చేశారు. కానీ, 2021లో కూడా విశ్వక్రీడలు జరిగే అవకాశం లేదని 77 శాతం మంది జపాన్‌ వాసులు అభిప్రాయపడినట్టు ఓ సర్వే తెలిపింది. ఒలింపిక్స్‌ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో జపనీస్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ ప్రజాభిప్రాయం కోసం పోల్‌ నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యకరంగా 77 శాతం మంది ‘వచ్చే ఏడాది మెగా క్రీడలు జరిగే అవకాశం లేదు’ అని చెప్పారని తెలిపింది. అయితే, ఎందుకు అనేదానికి మాత్రం స్పష్టమైన కారణాలను వివరించలేదని చెప్పింది.


Advertisement
Advertisement
Advertisement