Abn logo
Aug 4 2020 @ 01:52AM

28 ఏళ్లుగా నిరాహారంగా రామాలయం కోసం ఓ వృద్ధ మహిళ దీక్ష

ఊర్మిళా చతుర్వేది.. 81 ఏళ్ల వృద్ధురాలు. శ్రీరామభక్తురాలు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 28 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఈమె.. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసమైనప్పుడు.. రాముడి గుడి కట్టేవరకు అన్నం, రొట్టెల జోలికి వెళ్లనని శపథం చేశారు. అప్పుడు ఆమె వయసు 53 ఏళ్లు. ఇన్నాళ్లుగా పండ్లు మాత్రమే తీసుకుంటున్నారు. బుధవారం భూమిపూజ నిమిత్తం అయోధ్యకు వెళ్లాలని భావిస్తున్నా.. కరోనా ఆంక్షల కారణంగా బయటివారికి ప్రవేశం లేదు. దీంతో టీవీలోనే చూసి తరించాలని అనుకుంటున్నారు. అంతా బాగుంటే తన శేష జీవితాన్ని అయోధ్యలోనే గడపాలని ఆమె భావిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement