Abn logo
Aug 7 2020 @ 01:02AM

మహమ్మారి బారిన పడ్డ ఒహియో రాష్ట్ర గవర్నర్!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్.. విలయం సృష్టిస్తోంది. అమెరికాలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలోని ఒహియో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ గురువారం రోజు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఈ విషయంపై వైట్‌హౌస్ స్పందించింది. మహమ్మారి నుంచి మైక్ డివైన్ త్వరగా కోలువాలని.. అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నట్లు ప్రకటించింది.  అమెరికాలో కరోనా బారినపడిన రెండవ గవర్నర్ మైక్ డివైనే అని తెలుస్తోంది. అంతకుముందు జూలైలో.. ఓక్లహోమా రాష్ట్ర గవర్నర్ కెవిన్ స్టివ్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య అరకోటికి చేరింది. 1.62లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. 


Advertisement
Advertisement
Advertisement