Abn logo
Sep 24 2021 @ 23:54PM

‘వెలి’పై అధికారుల విచారణ

చినిమిల్లిపాడులో విచారణ చేస్తున్న తహసీల్దారు, ఎస్‌ఐ

ఆంధ్రజ్యోతి కథనంపై  స్పందన 

చినిమిల్లిపాడు (ఆకివీడు రూరల్‌) సెప్టెంబరు 24 : ఆకివీడు మండలం చినిమిల్లిపాడులో బలే నాగేశ్వరరావు కుటుంబం వెలి ఘటనపై ఆకివీడు మండల తహసీల్దారు గురుమూర్తి రెడ్డి, ఎస్‌ఐ యుగంధర్‌ కిరణ్‌కుమార్‌ శుక్రవారం గ్రామంలో విచారణ చేప ట్టారు. వెలికి గురయ్యామని చెబుతు న్న నాగేశ్వరరావు కుటుంబాన్ని, గ్రామస్థులను పిలిచి విచారణ చేశారు. ఇరుపక్షాల వాదనలు తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు.  ఈ విధమైన విచారణ వల్ల నిజాలు బయటకు రావని, గ్రామంలో కట్టుబాటు పెట్టారని, సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారని బాధితులు ఆరోపించారు.