Abn logo
Jun 2 2020 @ 04:04AM

గ్రామాలలో అధికారుల పర్యటన

అయిజ, జూన్‌ 1 : అయిజ మండలంలోని పలు గ్రామాల్లో డీఆర్‌డీఓ నర్సింహులు, మండల ప్రత్యేకాధికారి జయరాజ్‌, ఎంపీడీఓ రమణారావులు సోమవారం పర్యటించారు. ఉప్పలలో మొక్కల పెంపకం కేంద్రాన్ని, ఉత్తనూర్‌లో నిర్మాణంలో ఉన్న కంపోస్టు షెడ్‌లను పరిశీలించారు. పల్లెల్లో ప్రారంభమైన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింహరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement