Abn logo
Aug 7 2020 @ 00:43AM

అధికారబలంతో ప్రభుత్వ భూముల కబ్జా

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ మండలంలో అధికార బలంతో ప్రభుత్వ భూ ములను కబ్జా చేస్తున్నారని వైస్‌ ఎంపీపీ జంగమ్మతోపాటు అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. గురువారం మండల పరిధిలోని చౌదరిగూడ పంచాయతీలోని ఏడెకరాల ప్రభుత్వ భూమిని, జోడిమెట్ల సమీపంలోని నాలుగువేల చదరపు గజాల డాక్టర్స్‌ కాలనీ పార్కు స్థలాన్ని వారు పరిశీలించారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌ ఎంపీపీ కర్రె జంగమ్మ, అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ఘట్‌కేసర్‌ మండలంలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అండదండలతోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ప్రజా సంపదను దోచుకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో అమరేందర్‌రెడ్డి, రాజేష్‌, సంజీవగౌడ్‌, జగన్‌మోహన్‌రెడ్డి, బాల్‌రాజ్‌, యాదయ్య, సబిత, జయచంద్ర, ఈశ్వర్‌ పాల్గొన్నారు.    

Advertisement
Advertisement