Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి..!

ఆంధ్రజ్యోతి(19-10-2021)

ప్రొటీన్లు, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వగలిగితే నీరసం దరి చేరదు. ఇలాంటి ఆహారంలో ప్రధానమైనవి ఓట్స్‌. తేలికగా తయారుచేయగలిగే ఓట్‌ మీల్‌తో ఉండే ప్రయోజనాలు లెక్కలేనన్ని! అవేంటంటే...


పీచు, ప్రొటీను పొట్టను నింపి ఎక్కువ సమయం పాటు ఆకలి దరి చేరకుండా చేస్తాయి. ఈ పోషకాలు పుష్కలంగా ఉన్న ఓట్స్‌ను ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల మధ్యాహ్న భోజనవేళ లోపు మరొక పదార్థం వైపు మనసు మళ్లకుండా ఉంటుంది.

ఓట్స్‌ను రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. వండే అవసరం లేదు కాబట్టి, ఉదయాన్నే నిద్రలేచి అల్పాహారం తయారీకి సమయం వెచ్చించే శ్రమ కూడా తప్పుతుంది.


ఓట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. దీన్లోని అత్యధిక పీచు, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తూ ఉంటాయి. దీంతో శరీరం గ్లూకోజ్‌, ఇన్సులిన్‌లను సక్రమంగా వినియోగించుకుంటుంది. ఫలితంగా మధుమేహం దరి చేరకుండా ఉంటుంది. 


ఓట్స్‌తో కేన్సర్‌ నుంచి రక్షణ దక్కడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. వ్యాధినిరోధకశక్తి కూడా బలపడుతుంది.


ఓట్స్‌లో ఉండే ప్రత్యేకమైన ఫైబర్‌ బెలా గ్లూకాన్‌, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement