Abn logo
Oct 15 2020 @ 11:05AM

ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌

Kaakateeya

ముఖం నిర్జీవంగా, అలసిపోయినట్టు కనిపించినప్పుడు ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌తో కొద్ది సేపట్లోనే తాజాదనాన్ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే...


ఫేస్‌ప్యాక్‌ తయారీ కోసం ఓట్స్‌, తేనె, పాలు తీసుకోవాలి. ముందుగా ఓట్స్‌ను మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. కొద్దిగా ఓట్స్‌ పొడి తీసుకొని దీనిలో తేనె, పాలు వేసి పేస్ట్‌  మాదిరి చేసుకోవాలి. 

ఇప్పుడు ఈ పేస్ట్‌ను ప్యాక్‌లా ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత స్క్రబ్బింగ్‌ చేస్తూ, చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మానికి తేమ, పోషణ అందుతాయి. ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.



Advertisement
Advertisement