Abn logo
May 5 2020 @ 00:41AM

ఓ కరోనా! నీకిది తగునా?

గాలిలో ధూళిలో కనిపించక ఉన్నావు

కనీవినీ ఎరుగని రీతిలో భయపెడుతున్నావు

జనసమూహంలోకి ఎగిరివస్తున్నావు

భూమాత కంపించేలా శవాలగుట్టలు పేరుస్తున్నావు

కన్నవాళ్లను కానివాళ్ళను చేస్తున్నావు

కడసారిచూపు లేకుండా పాపం మూటగట్టుకుంటున్నావు

దేవుళ్ళ గుళ్ళలో తలుపులు తెరవకుండా చేశావు

చర్చిలలో ప్రార్థనలు లేకుండా చేశావు

మసీదులలో నమాజు చెయ్యనివ్వకున్నావు

ఆపు ఇక నీ వికృత చేష్టలు

ఆపు నీ కరాళ నృత్యాలు

ఇక చాలు నీ స్వైరవిహారాలు

ఇక చాలు నీ మరణమృదంగాలు

దయతలచి తరలిపో

కరుణతో కరిగిపో

ఈ భూభాగం వదిలి వెళ్ళిపో

ఆ నింగిలోకి దూసుకుపో

కడలి తరంగాలలో కలిసిపో

అగ్నికీలల్లో కాలిపో

నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి

Advertisement
Advertisement
Advertisement