Abn logo
Mar 30 2020 @ 17:20PM

ఎన్టీఆర్‌తో జాన్వీకపూర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్.. జాన్వీకపూర్‌కు ఫోన్ చేశారట. ఈ చిత్రంలో నటించమని ఆమెను కోరాడట.  జాన్వీకి కూడా తెలుగులో నటించాలని ఉందట. అయితే డేట్స్ విషయంలో తర్జన భర్జన జరుగుతోందట. ఒకవేళ జాన్వీతో కుదరకపోతే పూజా హెగ్డేను తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్-పూజాహెగ్డేతో ‘అరవింద సమేత’ను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రీసెంట్‌గా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా పూజా నటించారు. ఇప్పుడు ఈ కొత్త చిత్రంలో ఆమె నటిస్తే హ్యాట్రిక్ అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement