Abn logo
Apr 4 2020 @ 16:04PM

ఎన్టీయార్-త్రివిక్రమ్ టార్గెట్ అదేనా?

`ఆర్ఆర్ఆర్` వంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనేది యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్లాన్. అందుకే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. షూటింగ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందనేది తాజా సమాచారం. ఈ లోపు ప్రీ-ప్రొడక్షన్ వర్క్, లొకేషన్స్ ఫైనలైజ్ చేయడం వంటి పనులు పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది వేసవి టార్గెట్‌గా ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. హారిక హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి `అయిననూ పోయి రావలే హస్తినకు` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement