Abn logo
Jul 13 2020 @ 17:58PM

అర్ధాంతరంగా నిలిపివేత.. చెదిరిన సొంతింటి కల!

చాలీచాలని జీతాలు. కూలీ పనులతో జీవనం. బాడుగ ఇళ్లకు అద్దెలు కట్టలేని పరిస్థితి. సొంతింటి ఆశలు లేని కష్టాల జీవనం. ఆ ఆశల కలలు ఇప్పుడు నిజంగా కలగానే మిగిలిపోతోంది. శ్రీకాళహస్తిలో ఇది పరిస్థితి.


శ్రీకాళహస్తి పట్టణ శివారులో శివనాథపురం, రాజీవ్‌నగర్ కాలనీల వద్ద పేదలకు  సొంతింటి నిర్మాణ పనుల కోసం స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలానికి న్యూ ఎన్టీఆర్  కాలనీగా నామకరణం చేశారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన  పథకం కింద అందరికీ ఇళ్లు పేరుతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పథకం కింద పట్టణ పరిథిలో ఇళ్లులేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి 2017వ సంవత్సరంలో 6015 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇంటికి రూ.50 వేలు.. 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇంటికి రూ. లక్ష చొప్పున లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లించారు.


తొలి విడతలో 2,916 ఇళ్లను రెండో విడతలో 3,099 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. తొలి దశలో చేపట్టిన 2, 916 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండో విడతలో చేపట్టిన 3,099 ఇళ్ల నిర్మాణాల్లో కొన్ని దాదాపుగా పూర్తి అవగా మరికొన్ని వివిధ దశల్లో సాగుతూ ఉండగా కొత్త ప్రభుత్వం రాగానే అర్ధాంతరంగా ఆగిపోయాయి. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement