Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్టీఆర్ యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన

విజయవాడ: ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ నిధులు రూ. 400 కోట్లను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌లోకి మార్చిన వీసీ చర్యను వ్యతిరేకిస్తూ వర్శిటీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేయాల్సిన అధికారులే... దెబ్బ కొడుతున్నారని, నిబంధనలు పట్టించుకోకుండా వీసీ.. ఏకపక్షంగా రూ. 400 కోట్లు బదలాయించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వీసీకి నిధులు మళ్లించే అధికారం లేదన్నారు. రూ. 400 కోట్ల ద్వారా వచ్చే వడ్డీతో యూనివర్శిటీ కార్యకలాపాలు జరిగేవన్నారు. ప్రతియేటా రూ. 30 కోట్లు ఖర్చు అవుతుంటే... ప్రభుత్వం ఐదు కోట్లు మాత్రమే ఇస్తుందని.. ఇలా అయితే యూనివర్శిటీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కూడా దెబ్బ తింటుందని, నాణ్యమైన విద్య, ప్రాక్టికల్స్‌ను కూడా అందించలేమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నిలిచిపోతాయని, ఉద్యోగుల పరిస్థితికి ఇప్పుడు ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిధులు వెనక్కి పంపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వర్శిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement