Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్‌ ఆదాపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

విద్యుత్‌ ఆదాపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

లబ్బీపేట, డిసెంబరు6:  కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ ఆదా అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు  సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో పెయింటింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 200 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెయిం టింగ్‌ పోటీల ఏపీ నోడల్‌ ఆఫీసర్‌ టి. మల్లయ్య మాట్లాడుతూ చిన్నారులకు విద్యుత్‌ పొదుపుపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే వివిధ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలకు అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. విద్యార్థులు వేసిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు ఈ నెల 10న విశాఖపట్నంలోని ఎన్‌టీపీసీ పరవాడలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తారని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారిని న్యూఢిల్లీ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు.

Advertisement
Advertisement