Abn logo
Sep 24 2021 @ 23:14PM

కళాశాలల్లో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం

కౌటాలలో ర్యాలీ నిర్వహిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 24: కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు సమాజ సేవ చేయడం వలన విద్య, ఉద్యోగ రంగాల్లో గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి దత్తాత్రేయ, లెక్చరర్లు జనార్దన్‌, రాజేశ్వర్‌, దేవేందర్‌, హాథి రాం, కృష్ణవేణి పాల్గొన్నారు.  ప్రభుత్వజూనియర్‌ కళాశాలలో విద్యార్థులు పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి రవి, లెక్చరర్లు ఆనంద్‌, మన్మోహన్‌, అశోక్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో జిల్లా మాధ్యమిక విద్యాధికారి శ్రీధర్‌ సుమన్‌ మాట్లాడారు. విద్యార్థిదశ నుంచే సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రాం అధికారి శ్రీనివాస్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ డేను నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ ఎస్‌పీవో సపన్‌ కుమార్‌ మండల్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ డే సందర్భం గా విజేత హాస్పిటల్‌ డాక్టర్‌ నవత ఆధ్వర్యంలో రక్తదాన, వైద్యశిబిరాలను నిర్వహించారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ కళ్యాణి, ఉపాధ్యాయులు సాజిద్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు కొవిడ్‌ నిబంధన లతో పాటు వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన జాగ్ర త్తలు, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ స్వరూప, పీవోలు రాము, రాజమల్లు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.