Abn logo
Mar 6 2021 @ 08:13AM

అమరజవాన్‌ కుటుంబానికి ఎన్నారైల ఆర్థిక ద‌న్ను!

నిజామాబాద్(వేల్పూర్)‌: మండలంలోని కోమన్‌పల్లి గ్రామానికి చెందిన అమరజవాన్‌ ర్యాడ మహేష్‌ కుటుంబానికి తెలంగాణ ప్రవాస భారతీ యులు రూ.4లక్షల 67వేల 113లను శుక్రవారం అందజేశారు. నవంబర్‌ నెలలో కాశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో కోమన్‌పల్లికి చెందిన ర్యాడ మహేష్‌ వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల చలించిన ప్రవాస భారతీయులు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కుకు నూర్‌ గ్రామానికి చెందిన ర్యాడ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో విరాళాలను సేకరించారు. ఈ మొత్తాన్ని కోమన్‌పల్లి గ్రామంలోని అమరజవాన్‌ మహేష్‌ కుటుంబసభ్యులకు సెవ్‌గ్లోబల్‌ ఫార్మర్‌ అధ్యక్షుడు ర్యాడ రవీందర్‌ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పీఏసీఎస్‌ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కొత్త దయాసాగర్‌, దుంపల నరేష్‌, కొట్టాల అశోక్‌, యోగేష్‌, సంతోష్‌, కలిగోట సతీష్‌, పుప్పాల రాజేందర్‌, శ్రీనివాస్‌; గణేష్‌, రాడ్య భూమేష్‌, అమెరికలో ఉద్యోగం చేస్తున్న ర్యాడ రాజశేఖర్‌, సాగర్‌, శ్రావణ్‌, జనార్దన్‌ సహకారంతో సాయం అందజేశారు.

Advertisement
Advertisement
Advertisement