Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికాలో టీడీపీ నేతల నిరసన.. వైసీపీ నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను ఉద్దేశించి వైసీపీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అమెరికాలో NRI తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. కనెక్టికట్ రాష్ట్రం హర్ట్ఫోర్డ్ నగరంలో టీడీపీ నేతలు వైసీపీ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అంతకుమునుపు.. తెలుగుదేశం సైనికులు పసుపు ప్రతిజ్ఞ చేశారు. “ఏ సభలో అయితే మా నాయకుడు చంద్రబాబుకు అవమానం జరిగిందో ఆ సభలోనే ఆయనని రారాజుగా నిలబెట్టడం కోసం ప్రతిక్షణం శ్రమిస్తాం’’ అంటూ టీడీపీ నేతలు ముక్తకంఠంతో ప్రతినబూనారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు వైసీపీ తీరును ఖండించారు. అధికార మదంతో వారు అభ్యంతరకరమైన భాష వినియోగించారని, ఆ అధికారం దూరమైన రోజున వారి పరిస్థితి జంతువులతో సమానమవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను బంగాళా ఖాతంలో కలిపేయడం ఖాయమంటూ మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో యెండూరి శ్రీనివాసరావు, తరణి పరుచూరి,అశ్విన్ అట్లూరి,వీరు చౌదరి ఎద్దు, రామ్ కాజ,కిరణ్ పైనేని, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement