Abn logo
Jun 19 2021 @ 08:10AM

ఖతర్‌లో ఉంటూ.. విశాఖలో 88 లక్షల పెట్టుబడులు

మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన ఈడీ

విశాఖ వాసి పెట్టుబడుల నిలుపుదల

విశాఖపట్నం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి ఖతర్‌లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా అక్కడి నుంచి ఇక్కడికి నిధులు పంపి, పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేశారు. రూ.88 లక్షల పెట్టుబడులను ఫ్రీజ్‌(నిలుపుదల) చేశారు. విశాఖకు చెందిన పిన్నింటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్‌ ఖతర్‌లో ఉంటున్నారు. అక్కడి దోహా నేషనల్‌ బ్యాంకు నుంచి విశాఖలోని యాక్సిస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులకు రూ.45 లక్షలు బదిలీ చేశారు. వాటిని ఆయన భార్య, తన పేరిట మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఈ నెల 15న సీతమ్మధారలోని శ్రీనివాస్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులతో పాటు.. మరో రూ.43 లక్షలతో మూడు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వీటిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.