Abn logo
May 21 2020 @ 10:20AM

వెంటిలేట‌ర్లు విరాళంగా ఇచ్చిన ఎన్నారై..

హోషియార్పూర్(పంజాబ్‌): దుబాయ్‌కు చెందిన సర్బాత్ డా భాలా ఛారిటబుల్ ట్రస్ట్ చీఫ్ ట్రస్టీ డాక్టర్ ఎస్‌పీ సింగ్ ఒబెరాయ్... హోషియార్పూర్ సివిల్ ఆస్ప‌త్రికి వెంటిలేట‌ర్లు విరాళంగా ఇచ్చి ఉదార‌త‌ను చాటుకున్నారు. రూ. 12 ల‌క్ష‌లు విలువ చేసే రెండు వెంటిలేట‌ర్ల‌ను ఆయ‌న ఆస్ప‌త్రి వైద్యుల‌కు అంద‌జేశారు. ప్ర‌స్తుత క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వెంటిలేట‌ర్లు విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటిన ఒబెరాయ్‌కు ఈ సంద‌ర్భంగా న‌గ‌ర డిప్యూటీ క‌మిష‌న‌ర్ అప్నీత్ రియాట్ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఆస్ప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డంలో ఈ వెంటిలేట‌ర్లు ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని ఆమె పేర్కొన్నారు. 


కరోనా మహమ్మారితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడుతున్న ప్ర‌స్తుత స‌మ‌యంలో ప్రజా సేవకు సహకరించడం సామాజిక సేవా సంస్థల కర్తవ్యం అని డాక్టర్ ఒబెరాయ్ అన్నారు. త‌న ట్ర‌స్టు త‌రఫున ఇప్ప‌టివ‌ర‌కు గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలు, సివిల్ ఆస్ప‌త్రుల‌కు 20 వేల పీపీఈ కిట్లు, 20 వేల‌ ఎన్95 మాస్క్‌లు, శానిటైజ‌ర్స్‌, 10 లక్షల మూడు లేయర్ల‌ మాస్క్‌లు అంద‌జేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భ‌విష్య‌త్తులో కూడా ఏదైనా వైద్య పరికరాలను అందించడానికి ట్రస్ట్ సిద్ధంగా ఉందని జిల్లా పరిపాలన మరియు ఆరోగ్య శాఖకు ఒబెరాయ్ హామీ ఇచ్చారు.    ‌     

Advertisement
Advertisement
Advertisement