Abn logo
Sep 25 2021 @ 00:04AM

NRI లు India లో భూములు కొనొచ్చు కానీ..

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నారైలు భారత్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం, స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలు ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(FEMA) ఆధీనంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పర్యవేక్షణలో జరుగుతుంది. ఫెమా నియమావళి ప్రకారం.. ఎన్నారైలు కూడా భారతీయులే. అయితే వారు దేశం వెలుపల నివశిస్తున్నారంతే. ఇక భారతీయ పౌరసత్వం లేకపోయినా తల్లిదండ్రులు భారతీయులై ఇక్కడే నివశిస్తుంటే.. అలాంటి వారిని ఓసీఐ(ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తారు.

అయితే ఈ రెండు వర్గాలకు చెందిన వారికీ భారత్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలను పెట్టింది. దాని ప్రకారం.. ఎన్నారైలు ఇండియాలో రెసిడెన్షియల్, కమర్షియల్ స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. వాటి కొనుగోలుకు సంబంధించి ఎన్నారైలపై ఎలాంటి పరిమితి కూడా లేదు. అంతేకాదు వీటిని కొనుగోలు చేసే సమయంలో అవసరమైతే భారత్‌లో హోమ్ లోన్ కూడా తీసుకునేందుకు ఎన్నారైలకు అనుమతి ఉంది. కానీ పంట పొలాలను, ఫాం హౌస్‌లను కొనుగోలు చేయడానికి మాత్రం వీల్లేదు.

ఇది మాత్రమే కాదు ఇండియాలో స్థలం కొనే సమయంలో కూడా ఎన్నారైలు చేసే చెల్లింపులపై కూడా ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. దాని ప్రకారం.. చెల్లింపులు బ్యాంకుల ద్వారా కానీ, లేదా ఎన్నారైల ప్రత్యేకంగా ఉండే ఎన్నార్‌ఈ/ఎన్నార్వో లేదా ఎఫ్‌సీఎన్‌ఆర్ ఖాతాల ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రావెలర్స్ చెక్ లేదా, ఫారెన్ కరెన్సీలో చెల్లింపులు జరగడానికి వీల్లేదు.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...