Advertisement
Advertisement
Abn logo
Advertisement

చేయని నేరానికి North Carolina వ్యక్తికి 24 ఏళ్ల జైలు.. చివరికి

నార్త్​​ కరోలినా: అమెరికాలోని నార్త్​​ కరోలినా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి విషయంలో అచ్చం సినిమాల్లో చూపించినట్లే జరిగింది. మనం చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఈ కరోలినా వ్యక్తి కూడా చేయని నేరానికి 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. చివరికి అతడు ఆ నేరం చేయలేదని రుజువు కావడంతో గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించారు. అలాగే అతనికి జరిగిన అన్యాయానికి 7.5లక్షల డాలర్ల(రూ.5.5కోట్లు) పరిహారం కోరుకునే వెసులుబాటు కల్పించారు. నార్త్​ కరోలినాకు చెందిన డాన్టే షార్పె అనే వ్యక్తి విషయంలోనే ఇది జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 1995లో జార్జ్ ర్యాడ్​క్లిఫ్​ హత్య కేసులో షార్పెకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పుడు అతని వయసు పందొమ్మిదేళ్లు. జార్జ్ హత్యకు సంబంధించి ఓ 15 ఏళ్ల బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు షార్పెను అదుపులోకి తీసుకోవడం.. న్యాయస్థానం కూడా ఆ బాలిక చెప్పిన మాటలను సాక్ష్యంగా తీసుకునే షార్పెకు శిక్ష విధించడం చకచక జరిగిపోయాయి. 

అయితే, తాను ఏ నేరం చేయలేదని, ఈ కేసును మళ్లీ విచారించాలని షార్పె ఎన్నిసార్లు కోరిన ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఓ మాజీ వైద్య నిపుణుడు ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించడంతో అసలు విషయం తెలిసింది. ఆమె చెప్పిన దానికి హత్య జరిగిన తీరుకు పొంతన లేదని గుర్తించారు. అసలు అలా కాల్పులు జరగడం అసాధ్యమని తేల్చేశారు. అంతే.. దాంతో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించాల్సిందిగా న్యాయస్థానం పోలీస్ అధికారులను ఆదేశించింది. 2019లో షార్పెను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


న్యాయస్థానం ఆదేశాలతో షార్పె 24 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటపడ్డారు. ఇక జైలు నుంచి విడుదలైన షార్పెకు అన్యాయం జరిగిందని తెలియడంతో న్యాయ సంఘాలు నిరసనకు దిగాయి. అతనికి క్షమాభిక్ష ప్రసాదించడంతో పాటు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఏకంగా నార్త్ కరోలినా రాష్ట్ర గవర్నర్ రాయ్ కూపర్ ఇంటి ముందు ధర్నా చేయడంతో. షార్పె కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఆయన.. క్షమాభిక్ష ప్రసాదించారు. అలాగే అతడు శిక్ష అనుభవించిన 24 ఏళ్లకు ఒక్కొక్క ఏడాదికి గాను 50వేల డాలర్ల చొప్పున మొత్తం 7.5లక్షల డాలర్ల(రూ.5.5కోట్లు) పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement