Abn logo
Sep 21 2021 @ 23:53PM

క‘రుణ’ చూపేదెప్పుడో?




 డ్వాక్రా మహిళలకు మంజూరు కాని హౌసింగ్‌ రుణాలు 

 ఇప్పటివరకు రూ.7.96 కోట్లు మాత్రమే చెల్లింపు

 రెండు నెలలుగా ఎదురుచూపులు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

సొంతింటి కల నెరవేర్చుకుందామనుకున్న పేదలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రుణాలను కూడా డ్వాక్రా సంఘాల వారికే ఇస్తామని చెప్పింది. ఇది జరిగి దాదాపు రెండు నెలలు దాటుతోంది. ఇప్పటివరకు 40 శాతం మందికే రుణాలను మంజూరు చేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇంటి లబ్ధిదారుల్లో డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు 22,107 మంది ఉన్నారు. వీరిలో రుణాలు పొందేందుకు 13,168 మంది అర్హులుగా గుర్తించారు. బ్యాంకర్లను ఒప్పించి.. డీఆర్డీఏ ద్వారా రుణాలను మంజూరు చేయించాలని నిర్ణయించారు. ఆ రుణాలను సకాలంలో మంజూరు చేయకపోవడంతో ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేకపోతున్నారు. మొత్తం రూ.60,41,19,000 రుణాలు ఇప్పించాల్సి ఉంది. కానీ.. ఇందులో కేవలం 1,539 మందికి మాత్రమే రూ.7,96,16,158 మంజూరు చేశారు. ఇంకా 11,629 మందికి రూ.52,45,02,842 రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. బ్యాంకులను సమన్వయం చేసుకుంటూ.. రుణాలను ఇప్పించే విషయంలో జిల్లా అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తప్పని ఎదురుచూపులు...

రుణాలను సకాలంలో ఇవ్వకపోవడంతో డ్వాక్రా మహిళలు తమ ఇళ్ల నిర్మాణాలను ఆశించిన స్థాయిలో చేపట్టలేకపోతున్నారు. పాలకొండ, వీరఘట్టం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో కేవలం ఒక్కొక్కరికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.

-టెక్కలి మండలంలో 601 మందికి రూ.2.6 కోట్లు రుణం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 21 మందికి రూ.10.50లక్షలే ఇచ్చారు. 

-సంతబొమ్మాళి మండలంలో 514 మందికి రూ.2.02కోట్లు చెల్లించాల్సి ఉండగా... కేవలం 47 మందికి రూ.18.85లక్షలు అందించారు.

- నందిగాం మండలంలో 44 మందికి మాత్రమే రూ.17.63లక్షలు ఇచ్చారు. 

- దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో లబ్ధిదారులు రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రుణాలు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

----------------------------------------------------------------------------------------------

మండలం అర్హులు ఇవ్వాల్సినది పొందినవారు ఇచ్చినది

---------------------------------------------------------


రాజాం 366 79,30,000 58 35,01,900

రేగిడి 218 59,10,000 26 17,76,000

సంతకవిటి 580 1,46,20,000 51 13,64,000

వంగర 46 23,00,000 42 18,85,000

ఆమదాలవలస 883 4,21,15,000 96 51,19,000

ఎచ్చెర్ల 156 90,50,000 29 22,51,860

లావేరు 196 1,24,80,000 41 25,74,000

పొందూరు 892 4,46,00,000 30 14,52,000

రణస్థలం 272 1,12,31,000 56 33,05,300

గార 420 2,10,00,000 114 61,98,298

నరసన్నపేట 897 4,48,60,000 174 99,44,000

పోలాకి 398 1,73,71,000 89 40,42,550

శ్రీకాకుళం 767 4,52,60,000 50 27,96,084

బూర్జ 181 24,50,000 10 4,56,000

సరుబుజ్జిలి 66 31,70,000 18 8,84,000

జి.సిగడాం 389 1,54,70,000 33 22,13,500

జలుమూరు 234 1,04,30,000 115 46,65,936

ఇచ్ఛాపురం 521 2,53,59,000 22 10,70,000

కంచిలి 1226 6,38,00,000 49 29,00,000

కవిటి 1012 5,11,50,000 29 14,62,000

పలాస 327 1,54,60,000 41 22,80,000

సోంపేట 908 4,54,20,000 174 90,68,800

వజ్రపుకొత్తూరు 493 2,06,80,000 15 9,76,000

కోటబొమ్మాళి 204 76,20,000 62 25,77,000

---------------------------------------------------------------------------------------------------

మొత్తం 13,168 60,41,19,000 1,539 7,96,16,158

------------------------------------------------------------------------