Abn logo
May 28 2020 @ 23:52PM

ఎవరూ చెప్పని... ఎక్కడా వినని... ప్రాణమున్న కథ!

‘‘మనం ఇంతవరకూ ఎన్నో రకాల కథలు విన్నాం. కానీ, ఇప్పుడు నేను చెప్పబోయేది మన దేశంలోని ఒక అందమైన మహారణ్యంలో ఉంటున్న జంతుజీవాల గురించి ఎవరూ చెప్పని, ఎక్కడా వినని ప్రాణమున్న కథ. మన తోటి ప్రాణుల కథ’’ అని ప్రకాశ్‌రాజ్‌ అంటున్నారు. కర్ణాటకలోని దట్టమైన అడవుల్లోనూ, విశాలమైన మైదానాల్లోనూ స్వేచ్ఛగా తిరిగే జంతుజీవాలపై డిస్నీ ఛానల్‌ ‘వైల్డ్‌ కర్ణాటక’ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. జూన్‌ 5న ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ భాషల్లో ప్రకాశ్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ‘‘ప్రకృతికి వాయిస్‌ ఇవ్వడమనేది ఒక అర్థవంతమైన ప్రయాణం. ఇంతకు ముందు ఎప్పుడూ ఇండియాలో వైల్డ్‌లై్‌ఫను చూపించని విధంగా ‘వైల్డ్‌ కర్ణాటక’ కార్యక్రమంలో చూపించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ కథను వివరించడం గర్వంగా ఉంది’’ అని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు మహేశ్‌బాబు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement