Jul 29 2021 @ 02:26AM

ఎవరూ తప్పించుకోలేరు

భోపాల్‌ గ్యాస్‌ సంఘటన ఇతివృత్తంతో థ్రిల్లింగ్‌ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రూపొందిన చిత్రం ‘తప్పించుకోలేరు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 13న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. 


‘‘మధ్యప్రదేశ్‌ పర్యాటక సంస్థ సహకారంతో భోపాల్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. ఈ సినిమాను అక్కడ కూడా విడుదల చేయాలనుకుంటున్నాం.’’ అని చిత్ర దర్శకుడు ఆర్‌.వి.జి (రుద్రారపట్ల వేణుగోపాల్‌) తెలిపారు. ఆదర్శ్‌, హరీష్‌, ట్వింకిల్‌ అగర్వాల్‌, సాయిశ్వేత ప్రధాన  పాత్రలు పోషిస్తున్నారు. టి. వినోద్‌కుమార్‌ ముదిరాజ్‌, శ్రీనివాస్‌ ఎం., లలిత్‌కుమార్‌తో కలసి ఆర్‌.వి.జి నిర్మిస్తున్నారు.