Abn logo
Sep 21 2020 @ 18:43PM

మరో మూడు రోజులు ఆగాల్సిందే.. సంజన బెయిల్ పిటిషన్‌పై..

Kaakateeya

డ్రగ్స్ కేసులో రాగిణి, సంజనల బెయిల్ పిటిషన్‌పై విచారణ 24కి వాయిదా

బెంగళూరు: కర్ణాటకలో, మరీ ముఖ్యంగా శాండల్‌వుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రాగిణి ద్వివేది, సంజన బెయిల్ పిటిషన్లపై విచారణ సెప్టెంబర్ 24కి వాయిదా పడింది. ప్రస్తుతం రాగిణి, సంజన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రాగిణి జ్యుడీషియల్ కస్టడీ గడువు సెప్టెంబర్ 28కి, సంజన కస్టడీ గడువు సెప్టెంబర్ 30కి ముగియనుంది.


వీరిద్దరికీ అత్యంత సన్నిహితులు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం, నేరాన్ని అంగీకరించడంతో విచారణ నిమిత్తం రాగిణి, సంజనలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరి ఇళ్లలో సీసీబీ పోలీసులు సోదాలు చేసి పలు కీలక ఆధారాలను సేకరించారు.

Advertisement
Advertisement
Advertisement