Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిత్యావసరాల పంపిణీ

కోవూరు, నవంబరు 27 : వరదలకు నష్టపోయిన బాధితులకు గిరిజన (యానాదుల) సంక్షేమ సంఘం గుం టూరు జిల్లా కమిటీ సహకారంతో శ్రీనివాసపురం గిరిజన కాలనీ, పోతిరెడ్డిపాళెం తిప్ప కాలనీల్లో శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలను వారికి అందించారు.   కార్యక్రమంలో యా నాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెంచ లయ్య, రాష్ట్ర కోశాధికారి ఎందేటి వెంకటసుబ్బయ్య, గుంటూరు జిల్లా కోశాధికారి బాపట్ల బ్రహ్మయ్య, జిల్లా నాయకులు బీయల్‌ శేఖర్‌, రాపూరు కృష్ణయ్య, చేవూరు సుబ్బారావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


కూరగాయల పంపిణీ


 స్థానిక స్టౌబీడీ కాలనీలో రోటరీ క్లబ్‌ నెల్లూరు శక్తి, రోటరీ క్లబ్‌ నెల్లూరు సౌత్‌ ప్రతినిధులు శనివారం కూరగాయల్ని పంపిణీ చేశారు.  కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ నెల్లూరు శక్తి అధ్యక్షురాలు దొడ్ల నీరజారెడ్డి, కార్యదర్శి హైమావతి, రెప్రజెంటేటివ్‌ సుమాంకిత, రోటరీ క్లబ్‌ సౌత్‌ సభ్యులు, ఏసీ కూరగాయల మార్కెట్‌ సెక్రటరీ అజీజ్‌, ఇంటర్నేషనల్‌ గవర్నర్‌ ఎలక్ట్‌ వొమ్మిన సతీష్‌, ప్రతినిధులు టి. శేఖర్‌, కొండా శేఖర్‌రెడ్డి, ఇసాక్‌, జమీర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement