Abn logo
Sep 19 2020 @ 23:51PM

ఉదయాన్నే నిత్యా... సాయంత్రం సుస్మితా!

Kaakateeya

చార్మినార్‌ దగ్గర చాలా రోజుల తర్వాత సినీ ప్రముఖులు సందడి చేశారు. చారిత్రక కట్టడాన్ని శనివారం ఉదయం కథానాయిక నిత్యా మీనన్‌ సందర్శించారు. ‘‘చార్మినార్‌ దగ్గర ఉదయాలు అలాగే ఉంటాయి’’ అని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి కుమార్తె, స్టయిలిస్ట్‌ సుస్మితా కొణిదెల శనివారం సాయంత్రం చార్మినార్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు తీసుకున్నారు. ‘‘భాగ్య నగరానికి ఆకర్షణ... చార్మినార్‌’’ అని ఆమె అన్నారు. వీళ్లిద్దరూ అక్కడికి ఎందుకు వెళ్లారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.   





Advertisement
Advertisement
Advertisement