Abn logo
Aug 5 2020 @ 21:29PM

నయన్ కోసం ప్రయత్నిస్తున్న నితిన్?

హిందీలో విజయవంతమైన `అంధాధున్` సినిమా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు చాలా నచ్చింది. దీంతో వెంటనే ఆ సినిమా రీమేక్ హక్కులు దక్కించుకున్నాడు. తన సొంత బ్యానర్‌పైనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులు కూడా చేసేశాడట. అయితే హిందీలో టబు చేసిన కీలక పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 


మొదట్లో రమ్యకృష్ణ, అనసూయ వంటి వాళ్ల పేర్లు వినిపించాయి. ఇటీవల ఇలియానాను సంప్రదిస్తే ఆమె తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. ఈ పాత్ర కోసం తాజాగా నయనతారను సంప్రదించారని తెలుస్తోంది. మంచి పాత్ర కావడంతో నయన్ కూడా ఆసక్తికరంగానే ఉన్నట్టు సమాచారం. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు నయన్ కాస్త భారీగానే రెమ్యునరేషన్ అడిగిందట. నయన్ నటిస్తే ఈ సినిమాకు వచ్చే క్రేజ్ భారీగా ఉంటుంది. కాబట్టి, చిత్రబృందం కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement