Abn logo
Sep 23 2020 @ 16:58PM

నితిన్ `రంగ్ దే` షూటింగ్ ప్రారంభం!

Kaakateeya

యువ కథానాయకుడు నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం `రంగ్ దే`. `సితార ఎంటర్‌టైన్మెంట్స్` సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. పరిస్థితులు కొద్దిగా అనుకూలించడంతో ఈ చిత్రం షూటింగ్ ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 


కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని షూటింగ్‌ను మొదలుపెట్టారు. నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం షూటింగ్‌లో పాల్గొన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2021 సంక్రాంతి  కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement