Abn logo
Jul 14 2020 @ 16:27PM

ఎట్టకేలకు `నిశ్శబ్దం` కూడా ఓటీటీ బాట పడుతోందా?

లాక్‌డౌన్‌కు సుమారు నెల రోజుల ముందే అనుష్క నటించిన `నిశ్శబ్దం` సినిమా ఫైనల్ ప్రింట్ సిద్ధమైపోయింది. అయితే మంచి విడుదల తేదీ కోసం వేసవి వరకు వెయిట్ చేయాలనుకున్నారు. ఈ లోపు కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా విడుదల కుదరలేదు. అమేజాన్ ప్రైమ్ సంస్థ విడుదలకు ముందుకొచ్చినా నిర్మాతలు అంగీకరించలేదు. అయితే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. 


జనాలు కూడా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు `నిశ్శబ్దం` కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. తెలుగుతో పాటు పలు భాషల్లో రూపొందిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే అమేజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల తరహాలోనే ఈ సినిమాకూ పబ్లిసిటీ చేయాలని అమేజాన్ కోరిందట. దానికి చిత్రబృందం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 


Advertisement
Advertisement
Advertisement